యాపిల్ ప్రొడక్ట్స్ తయారీ సంస్థ ఫాక్స్ కాన్ భారత్ లో 50వేల ఉద్యోగాలు పెంచే ఆలోచనలో పడింది. చైనాలో ఉన్న కోవిడ్ ఆంక్షల వల్ల యాపిల్ ప్రొడక్ట్స్ ల తయారీకి ఆటంకం కలుగుతుంది. ప్రపంచానికి ఉత్పత్తుల ఎగుమతీ ఆలస్యం అవుతుంది. ఈ కారణంతో, చైనాలో జరిగే యాపిల్ కార్యకలాపాలన్నింటినీ భారత్ కి తరలించాలని చూస్తున్నారు ఫాక్స్ కాన్ యాజమాన్యం.
ఇప్పటికే యాపిల్ అసెంబ్లింగ్ తో పాటు ఐఫోన్ 14 సిరీస్ ని చెన్నైలోని యాపిల్ ప్లాంట్ లో తయారుచేస్తున్నారు. అయితే, పూర్తి స్థాయిలో ఫాక్స్ కన్ కంపెనీని చైనా నుంచి భారత్ కి తరలించాలని చూస్తున్నారు. ఈ నేపద్యంలో ఉద్యోగుల సంఖ్యను నాలుగింతలు అంటే 53,000ల మంది ఉద్యోగుల్ని పెంచనున్నారు. ఫలితంగా చెన్నై ప్లాంట్ లో ఉద్యోగుల సంఖ్య 70,000లకు చేరనుంది.
