ఆంధ్రాను జగన్.. అదానీ రాష్ట్రంగా మార్చేశాడు.. అన్ని ఒప్పందాలపై విచారణ చేయాలి : షర్మిల

అదాని కేసు విషయంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల స్పందించారు.  మాజీ ముఖ్యమంత్రి  జగన్​ ... ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాన్ని .. అదానీ రాష్ట్రంగా మార్చేశాడంటూ... అప్పుడు  జరిగిన అన్ని ఒప్పందాలపై సమగ్ర విచారణ జరపాలని షర్మిల డిమాండ్​ చేశారు.   యూఎస్​ఏ న్యాయస్థానం.. అదానీపై అభియోగాలు మోపిందంటూ..  భారతదేశంలోని కొంతమంది ముఖ్యమంత్రులకు  గతంఓ అదాని లంచాలు ఇచ్చాడని.. వారిలో ఏపీ మాజీముఖ్యమంత్రి జగన్​ కూడా ఉన్నారని అన్నారు. 

జగన్ పేరు  బహిరంగంగా చెప్పకపోయినా ...  ఆగస్టు 2021 లో ఆంధ్రప్రదేశ్​ లో అధికారంలో ఉన్న పార్టీ నేతలకు  ముడుపులు ముట్టాయని తెలిపారు.  ఆంధ్రప్రదేశ్​ కు పవర్​ అమ్మేందుకు  అప్పట్లో సీఎంగా ఉన్న జగన్​ ను .. గౌతం అదాని కలిసి .. ఏది కావాలంటే అది ఇస్తానని ప్రామిస్​ చేశారని వార్తొస్తున్నాయి.  సీఎం ఆదేశాల మేరకు కొంతమంది అదానీతో లంచాల విషయాన్ని చర్చించారని క్లియర్​ ఉందని షర్మిల వెల్లండించారు. 

పవర్​ సప్లయ్​ విషయంలో అదాని .. జగన్​ కు 1750 కోట్ల రూపాయిలు లంచం ఇచ్చారని... ఈ విషయం అమెరికా బయటపెట్టేంత వరకు ఎందుకు బహిర్గతం కాలేదని షర్మిల ప్రశ్నించారు. అంతర్జాతీయ స్థాయిలో .. మన దేశం పరువు పోతే  నిఘా సంస్థలైన సీబీఐ, ఈడీ సంస్థలు ఏం చేస్తున్నాయి...  గత ఐదేళ్లలో అదానీ కోసం జగన్​చాలా డీల్స్​ చేసే ఉంటారని.. ఈ విషయాన్ని ఎవరు విచారిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు.  గంగవరం పోర్టులో ఎంత లంచం వచ్చింది.. కృష్ణ పట్నం పోర్ట్ ను అదానీకి ఎందుకు  కట్టబెట్టారు..  ఇందులో జగన్​ కు ఎంత లంచం వచ్చింది..  డేటా సెంటర్​కు భూమిని అప్పనంగా ఎందుకు ఇచ్చారంటూ ..నియమాలకు విరుద్దంగా అదానీకి కట్టబెట్టిన సోలార్​ ప్రాజెక్ట్​ను వెంటనే రద్దు చేయాలని షర్మిల డిమాండ్​ చేశారు.