లోకేష్ ప్రయోజకుడు కాలేదని చంద్రబాబు పరేషాన్

లోకేష్ ప్రయోజకుడు కాలేదని చంద్రబాబు పరేషాన్

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఓడిపోయాక ఈ దరిద్రం ఇక  పోయిందంటూ ప్రజలు అంటున్నారని ప్రభుత్వ ఛీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. అగ్రిగోల్డ్ విషయంలో తమ హయాంలోనే 300 కోట్ల రూపాయల చెక్ సిద్దం చేశామని లోకేష్ అంటున్నారు.. నిజానికి ఆ చెక్ పై సంతకం లేకపోతే అది చెల్లదనే విషయం లోకేష్ తెలియనట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.  లోకేష్ చెల్లని చెక్కు లాంటోడని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ హుందాగా రాజకీయం చేస్తుంటే..చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నారాలోకేష్ లోకేష్ ప్రయోజకుడు కాలేదని చంద్రబాబు కలత చెందుతున్నారని అన్నారు. చంద్రబాబు ఇకపై  రాయలసీమ, పులివెందుల గుండాలు, రౌడీలు అని వ్యాఖ్యలు చేస్తే రాయలసీమ మహిళలే వాతలు పెడతారని చెప్పారు. పోలీసు అమరవీరుల దినోత్సవం నాడు చంద్రబాబు డీజీపీ ఖబడ్దార్ అంటూ పోలీసు వ్యవస్దను కించపరిచేలా మాట్లాడారని, జగన్ చట్టం ఎవరి చుట్టం కాదు, నిష్ఫక్షపాతంగా పనిచేయాలని చెప్పారన్నారు.

చంద్రబాబు తన బినామీల్ని బీజేపీలోకి పంపుతున్నారు : గడికోట

చంద్రబాబు ప్రజలను ప్రాంతాలవారీగా మాట్లాడుతూ అవమానిస్తున్నారని, దిగజారి మాట్లాడితే  ప్రజలే బుద్దిచెప్తారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు హయాంలో 43 వేల బెల్ట్ షాపులు పెట్టి ప్రజలను దోచుకున్నారన్న శ్రీకాంత్ రెడ్డి.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా  వైసీపీ నేతలను,కార్యకర్తలను అనేక సార్లు ఇబ్బంది పెట్టారన్నారు. కాని సీఎం జగన్ మాత్రం అధికారంలోకి వచ్చాక ఎవరినీ వేధించవద్దని చెప్పారని అన్నారు.  బీజేపీ నేతల అంతుచూస్తానని ఎన్నికల సమయంలో మాట్లాడిన చంద్రబాబు నేడు మాట మారుస్తున్నారని, తాను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలేదని చంద్రబాబు కాళ్ల బేరాలాడుతున్నారన్నారు. నరేంద్రమోదిని,అమిత్ షాను వ్యక్తిగతంగా  విమర్శలు చేసి నేడు తన బినామిలను బీజేపీలోకి పంపుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృధ్ది అంశాలపై మాత్రమే సీఎం జగన్ అమిత్ షా,రవి శంకర ప్రసాద్, ఇతర కేంద్ర మంత్రులను అదికారులను కలుస్తున్నారని, చంద్రబాబు లా వ్యక్తిగత అంశాలపై కలవడం లేదని వివరించారు. చంద్రబాబు మైండ్ లో చిప్ ఉంది.. అందుకే సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నట్లే ఇంకా మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఎన్నికలలో చెప్పిన అబద్దాలు నమ్మక చిత్తుచిత్తుగా ఓడించారనే విషయం గుర్తించాలని శ్రీకాంత్ రెడ్డి వివరించారు.