ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు ప్రభుత్వం భారీ స్థాయిలో కరోనా టెస్ట్ లు చేస్తూ..ప్రజల్ని వైరస్ నుంచి రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.
కానీ ప్రజలు మాత్రం వైరస్ ఉందనే విషయాన్ని విస్మరించినట్లు ఉన్నారు. అందుకే ఎవరికి నచ్చినట్లు వాళ్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఓ వైపు అధికారులు , పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రజల్ని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కరోనా నుంచి సురక్షితంగా ఉండొచ్చని ప్రచారం చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల ప్రజలు ప్రభుత్వం సూచనల్ని బేఖాతరు చేస్తున్నారు.
అందుకు నిదర్శనమే ఇదేనంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆదివారం సాయంత్రం విశాఖ బీచ్ రోడ్ లో ఇసుకేస్తే రాలనంతమంది జనం సందడి చేశారు. కరోనా వైరస్ ఉందనే విషయాన్ని పట్టించుకోకుండా ఎంజాయ్ చేశారు.
