జనవరి 24న ఏపీ బంద్..ఎందుకంటే.?

అంగన్ వాడీలకు మద్దతుగా  జనవరి  24న ఏపీ బంద్‌కు పిలుపునిచ్చాయి ఏపీ ట్రేడ్ యూనియన్లు. 24న అందరూ బంద్  పాటించాలని పిలుపునిచ్చాయి. విధుల్లో చేరాలని ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా అంగన్ వాడీలు ఆందోళన చేస్తున్నారు.  అయితే ప్రభుత్వం ఇవాళ జనవరి 22 ఉదయం 9గంటల30 నిముషాల వరకు విధుల్లో చేరని అంగన్ వాడీలను తొలగించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.  

ప్రభుత్వ తీరుకు నిరసనగా  ఇవాళ చలో విజయవాడకు పిలుపునిచ్చారు అంగన్ వాడీలు. పోలీసులు కార్యక్రమాన్ని భగ్నం చేశారు. పలువురు అంగన్ వాడీలను అరెస్ట్ చేశారు.  అంగన్ వాడీల చలో విజయవాడను అడ్డుకోవడం, విధుల నుంచి తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ  అఖిలపక్ష ట్రేడ్ యూనియన్ జనవరి 24న బంద్ కు పిలుపునిచ్చింది.