నెల్లూరు ఏపీ టూరిజం ఆఫీసులో ఘటన
నెల్లూరు ఏపీ టూరిజం డివిజనల్ కార్యాలయంలో దారుణం చోటు చేసుకుంది. మాస్క్ ధరించాలని సూచించిన దివ్యాంగురాలైన ఉద్యోగినిపై… డిప్యూటీ మేనేజర్ భాస్కర్ దాడి చేశాడు. జుట్టుపట్టుకుని కుర్చీలోంచి లాగి కొట్టాడు. కుర్చీ హ్యాండిల్ విరగొట్టి.. దాంతో, ఆమె తలపై దెబ్బమీద దెబ్బలు వేస్తుంటే.. సాటి ఉద్యోగులు అడ్డుకున్నారు. అయినా విడిపించుకుని మహిళ జట్టుపట్టుకుని పదేపదే దెబ్బలు వేశాడు. కొంతకాలంగా ఉద్యోగినులపై భాస్కర్ వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. శాఖ ఖర్చులు తగ్గించుకునేందుకు పలువురిని ఉద్యోగాలు మానేయాలని ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు డిప్యూటీ మేనేజర్ భాస్కర్‌పై కేసు నమోదు అయింది. దర్గామిట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజీలో భాస్కర్ రావు దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాడి ఉదంతం ఉన్నతాధికారులకు చేరడంతో వారు భాస్కర్ రావుపై సీరియస్ అయ్యారు.
