మార్షల్ తో గొడవ ఏపీ అసెంబ్లీలో దుమారం రేగుతోంది. మార్షల్స్ గొడవ సందర్భంగా చంద్రబాబు తీరును తప్పుబట్టారు స్పీకర్ తమ్మినేని సీతారం. చంద్రబాబు అన్ పార్లమెంటరీ పదాలు వాడారని అన్నారు. ఇలాంటి లాంగ్వేజీ పార్లమెంటరీ వ్యవస్థకు మంచిదికాదన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు అలాంటి మాటలు మాట్లాడాల్సింది కాదన్నారు. చంద్రబాబు అలాంటి మాటలు అన్నట్లుగా వీడియో ఉందన్నారు. బయటి వ్యక్తులు అసెంబ్లీలోకి వచ్చినట్లుగా ఆరోపణలున్నాయని..దీనిపై విచారణ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశిస్తున్నట్లు చెప్పారు. సభ్యులు కాని వారు అసెంబ్లీలోకి వస్తే క్రిమినల్ కేసులు పెట్టాలని పోలీసులను ఆదేశించారు స్పీకర్.
