హైదరాబాద్ లో RGV ఇంటికి ఏపీ పోలీసులు : అరెస్టుకు రంగం సిద్ధం..?

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ఏపీలో పోలీస్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. వ్యూహం సినిమా విషయంలో ఆర్జీవీపై టీడీపీ నేతలు చేసిన ఫియాడు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు ప్రకాశం జిల్లా పోలీసులు. ఈ కేసులో నవంబర్ 19న విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే.. తనకు పనులు ఉన్నాయని, విచారణకు హాజరు కాలేనని... వారం రోజులు సమయం కావాలంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు వర్మ. దీంతో నవంబర్ 20న మరోసారి వర్మకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇవాళ ( నవంబర్ 25, 2024 ) విచారణకు హాజరు కావాల్సిన వర్మ రెండసారి కూడా డుమ్మా కొట్టారు.

వర్మ రెండోసారి కూడా విచారణకు హాజరు కాకపోవడంతో తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు ఏపీ పోలీసులు. వర్మను అదుపులోకి తీసుకోవడం కోసం సోమవారం ( నవంబర్ 25, 2024 ) ఉదయం హైదరాబాద్ కు చేరుకున్నారు ప్రకాశం జిల్లా పోలీసులు. వర్మ ఇంట్లో లేకపోవడంతో ఆయన నివాసం దగ్గరే వేచిఉన్నారు పోలీసులు. 


వ్యూహం సినిమా ప్రమోషన్స్ సమయంలో చంద్రబాబు, పవన్‌,  నారా లోకేష్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆర్జీవీ పోస్టులు పెట్టడంపై టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు ఒంగోలు రురల్ పోలీసులు. విచారణకు హాజరు కావాలని ఇప్పటికే రెండుసార్లు వర్మకు నోటీసులు పంపారు పోలీసులు. మొదట వారం రోజుల గడువు కోరిన వర్మ.. రెండోసారి కూడా విచారణకు డుమ్మా కొట్టడంతో తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు పోలీసులు. ఈ క్రమంలో పోలీసులు వర్మను ఏ క్షణానైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.