ఏపీలో కొనసాగుతున్న అరెస్టుల పర్వం: ఈసారి సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి

ఏపీలో ప్రస్తుతం అరెస్టుల పర్వం నడుస్తోంది. సోషల్ మీడియా ట్రోలింగ్ ను సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను, నాయకులను వరుసగా అరెస్ట్ చేస్తోంది. ఈ క్రమంలో ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామి రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు.

త్వరలో ఏపి సచివాలయ ఉద్యోగుల క్యాంటీన్‌ డైరెక్టర్ పదవుల ఎన్నిక నేపథ్యంలో.. వెంకట్రామి రెడ్డి వర్గం  ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మందు, విందు పార్టీ ఏర్పాటు చేసినట్లు గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు గురువారం ( నవంబర్ 28, 2024 ) అర్థరాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 

Also Read :- తీవ్ర వాయుగుండంగా ఫెంగల్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

ఉద్యోగులను ప్రభావితం చేయడానికి గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని కొండపావులూరి గార్డెన్‌లో మందు పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు పోలీసులు. అనుమతి లేకుండా మద్యం సరఫరా చేయడంతో సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు వెంకట్రామి రెడ్డిని అరెస్ట్ చేశారు.