బిగ్ బాస్ కంటెస్టెంట్ కి సపోర్ట్ చేసిన ఏపీ మినిస్టర్

బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో 8వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ క్రమంలో ప్రతీ కంటెస్టెంట్ టాస్క్ లలో బాగానే పెర్ఫార్మ్ చేస్తూ ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటున్నారు. అలాగే  ఓటింగ్ కోసం  సోషల్ మీడియా, సెలెబ్రెటీల సపోర్ట్  తీసుకుంటున్నారు. అయితే బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్ గా పాల్గొన్న కిరాక్ సీతకు టీడీపీ సినీనియర్ నాయకుడు ఫరూక్ తన మద్దతు తెలియజేశాడు.  

ALSO READ | నాని దసరా చిత్రానికి మరో అవార్డు

ఈ క్రమంలో రాయలసీమలోని నంద్యాల నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన కిరాక్ సీతకి అభినందనలు తెలిపాడు. అలాగే బిగ్ బాస్ టైటిల్ గెలవాలని సీతకి సూచించాడు. ఇందుకుగానూ ప్రతీ ఒక్కరూ సీతకి ఓటు వెయ్యాలని అభిమానులకి సూచించాడు. 

అయితే ఇప్పటివరకూ సినీ సెలెబ్రెటీలు బిగ్ బాస్ కంటెస్టెంట్లకి సపోర్ట్ చెయ్యడం చూసాం కానీ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి బహిరంగంగా మద్దతు తెలియజెయ్యడం ఇదే మొదటిసారి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.