టీడీపీ–జనసేన పొత్తు విషయంలో మంత్రి ఆదిమూలపు సురేష్ కామెంట్ చేశారు. చంద్రబాబు–పవన్ కళ్యాణ్ పొత్తు ఉదయించదు.. అస్తమిస్తుందన్నారు. ఎవరైనా రాజకీయ పార్టీ పెడితే అధికారంలోకి వచ్చి... ప్రజలకు సేవ చేయాలని అనుకుంటారన్నారు. కాని పవన్ కళ్యాణ్ వేరే పార్టీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడానికి జనసేన పెట్టారా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు ఎక్కడ ఉండరని తెలిపారు. పవన్ కళ్యాణ్ నిజంగా వామనుడూ నంటూ... బలిచక్రవర్తి తరహాలో చంద్రబాబును పవన్ తొక్కబోతున్నాడని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఎవరైనా పార్టీ పెడితే అదికారంలోకి రావాలని కోరుకుంటారు.. ప్రజలకు సేవచేయాలని వస్తారు.. పవన్ లా వేరే వాళ్లను ముఖ్యమంత్రిని చేయాలని రారని పేర్కొన్నారు. జగనన్న దెబ్బకు పవన్‌కు భయమేస్తుంది అందుకే అతనికి కేటాయించిన 24 స్థానాలలో తను ఎక్కడ పోటీ చేస్తాడో ప్రకటించలేదన్నారు. చట్ట సభలలో అడుగు పెట్టే రాత పవన్‌కి లేదన్నారు. టీడీపీ-జనసేన పొత్తు ఉదయించే పొత్తు కాదు.. అస్తమించే పొత్తు అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ పొత్తును ప్రజలు అంగీకరించటం లేదన్నారు.