సెల్‌ఫోన్‌ల వల్లే మహిళలు చెడిపోతున్నారని, రెండేసి సిమ్ కార్డులు వాడుతున్నారని ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు భాగ్యరాజా చేసిన వ్యాఖ్యలపై మహిళ సంఘాలు మండిపడుతున్నాయి. మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు వారు వాడుతున్న సెల్‌ఫోన్లు కారణమని ఓ ఆడియో ఫంక్షన్ లో చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. తమిళనాడులోని సంచలనం సృష్టించిన పోలాచీ కేసులో అమ్మాయి అవకాశం ఇచ్చినందువల్లే రేప్ జరిగిందని భాగ్యరాజా చెప్పడంపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ కూడా ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Related news: చేతుల్లో ఎప్పుడూ ఫోన్లు ఉండడం వల్లే మహిళలపై నేరాలు
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భాగ్యరాజాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తమిళనాడు మహిళా కమిషన్‌కు పద్మ లేఖ రాశారు. రేప్ ఘటనల్లో మహిళలను తప్పుబట్టేలా మాట్లాడటం ఎంతమాత్రం మానవత్వం కాదన్నారు. ప్రభుత్వాలు, మహిళా సంస్థలు, పోలీసులు, న్యాయవ్యవస్థ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంటే కొందరు సెలబ్రిటీలు మాత్రం మహిళలను కించపరచడం, దారుణాలకు మద్దతు పలుకడమేమిటని ఆమె మండిపడ్డారు.

