రేపు అర్థరాత్రి నుండి ఏపీ-కర్ణాటక మధ్య బస్సులు బంద్

రేపు అర్థరాత్రి నుండి ఏపీ-కర్ణాటక మధ్య బస్సులు బంద్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌-కర్ణాటక మధ్య అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిపివేయాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. కరోనా అన్ లాక్ మొదలైన తర్వాత ఏపీ నుండి పక్క రాష్ర్టాలకు మొదట కర్నాటకకే బస్సులు ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే నెల రోజులు తిరగకముందే కర్నాటకకు బస్సులు నిలిపేయాల్సి వచ్చింది.  కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో బెంగళూరులో మళ్లీ లాక్ డౌన్ ప్రకటించడంతో ఈ నెల 15 నుంచి 23 వరకు బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ ఈడీ బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. దీంతో రేపు రాత్రి నుంచి కర్ణాటకకు సుమారు 140 బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. కర్ణాటకలో కరోనా వ్యాప్తి తగ్గిపోయి తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతనే ఏపీ బస్సులు నడుపుతామని ఈడీ చెప్పారు. అయితే ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి డబ్బులు రీఫండ్ చేస్తామని బ్రహ్మానంద రెడ్డి తెలిపారు.