ఏపీలో జర్నలిస్టులకు తీపికబురు.. ఇళ్ల స్థలాల కేటాయింపునకు జీవో జారీ

జర్నలిస్టులకు ఏపీ సీఎం జగన్ తీపి కబురు చెప్పారు.  గత మంత్రివర్గ సమావేశంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ఏపీ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.  దీనికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం జీవో 395  విడుదలచేసి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.   

ఏపీలో ప్రతీ జర్నలిస్టుకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని  ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  60:40 శాతం చెల్లింపు పద్దతిలో ఇళ్ల స్థల కేటాయింపు ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.  ఇదిలా ఉంటే.. కనీసం 5 ఏళ్లు అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ వర్తించనుంది.  జిల్లా ఇంచార్జ్ మంత్రి నేతృత్వంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపునకు కమిటీలు ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించింది ప్రభుత్వం. అయితే ఆ కమిటీలో జర్నలిస్టులకు సభ్యులుగా అవకాశం కల్పించనుంది .ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టులు ఆన్ లైన్‌లో దరఖాస్తులు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక వెబ్‌ సైట్‌ను రూపొందించి.. 45 రోజుల్లోగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది