పదోతరగతి విద్యార్ధులు పాస్ : ఇంటర్ లో ఫెయిలైన విద్యార్ధులు పాస్

పదోతరగతి విద్యార్ధులు పాస్ : ఇంటర్ లో ఫెయిలైన విద్యార్ధులు పాస్

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉదృతంగా ఉండడంతో  పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని  పరీక్షలను రద్దు చేస్తున్నామని ఏపీ మంత్రి ఆది మూలపు సురేశ్  ప్రకటన చేశారు. ఇప్పటికే కరోనా వ్యాప్తి నేపథ్యంలో  తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ రాష్ట్రప్రభుత్వం పదో తరగతి పరీక్షల నిర్వహణపై  ఉన్నతాధికారులతో మంత్రి ఆది మూలపు సురేశ్ చర్చించి ఈ కీలక నిర్ణయంపై ప్రకటన చేశారు. మార్కులు, గ్రేడింగ్‌కు విధివిధానాలు రూపొందించాలని ఆదేశించాం. పదో తరగతి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నాం. భవిష్యత్తులో కరోనా కేసులు పెరుగుతాయని సర్వేలు చెబుతున్నాయి. అలాగే ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నాం. ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఏడాది ఫెయిలయిన వారు కూడా పాస్ అయినట్లే నని   మంత్రి ఆది మూలపు సురేశ్ చెప్పారు.