ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కాగా రేపటినుంచి సెంకడీయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు పరీక్షలు జరగనుంది. మొత్తం 4 లక్షల 73 వేల 58 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 26 జిల్లాల్లో 1,559 సెంటర్లను సిద్ధం చేశారు.
ఈ విద్యా సంవ త్సరంలో మొత్తం 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వారిలో మొదటి సంవత్సరం పరీక్షలకు 4,73,058 మంది, రెండో సం వత్సరం పరీక్షలకు 5,79,163 మంది హాజరవుతారు. మొత్తం 26 జిల్లాల్లో 1,559 సెంటర్లను పరీక్షలకు సిద్ధం చేశారు.
పరీక్షలు ముగిసేంత వరకు తాడేపల్లిలోని ఇంటర్ విద్య కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో ఫిర్యాదులు, గ్రీవెన్స్‌ల స్వీకరణకు 08645–277707, టోల్‌ఫ్రీ నంబర్ 18004251531కు రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కాల్ చేయొచ్చు.