గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లను ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) విడుదల చేసింది. 2024 మార్చి17న ఉదయం 10 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు పేపర్లకు సంబంధించిన పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష కోసం 1,48,881 మంది దరఖాస్తు చేసుకున్నారు.
పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు ఉండదని APPSC ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కేటాయించిన పరీక్ష కేంద్రాలను కనీసం ఒకరోజు ముందుగానే చూసుకొని వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా సమయానికి పరీక్షకు హాజరు కావచ్చని సూచించింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనున్నారు. హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఖాళీల వివరాలు
- డిప్యూటీ కలెక్టర్ పోస్టులు-9
- ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్-18
- డీఎస్పీ (సివిల్)- 26
- రీజనల్ ట్రాన్స్పోర్టు ఆఫీసర్-6
- డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు-5
- జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్- 4
- జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి- 3
- అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్స్- 3
- అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్- 2
- జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్- 1
- జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్-1
- మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ II-1
- ఎక్సైజ్ సూపరింటెండెంట్- 1