అమరావతిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత.. మాజీ సీఎం చంద్రబాబు ఇంటి వరకు వచ్చింది. మొన్న ప్రజావేదిక కూల్చేసిన అధికారులు.. ఇప్పుడు చంద్రబాబునాయుడు ఉంటున్న.. లింగమనేని ఎస్టేట్ భవనానికి నోటీసులు అంటించారు. సీఆర్డీఏ అసిస్టెంట్ డైరెక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి.. మరో ఇద్దరు అధికారులతో కలిసి వచ్చి నోటీసులిచ్చారు. ఇంటి గోడకు నోటీసులు అంటించి వెళ్లిపోయారు. చట్టపరమైన ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటిని, అందులో స్విమ్మింప్ పూల్, హెలిప్యాడ్ నిర్మించారని నోటీసులో రాశారు అధికారులు. ఏడు రోజుల్లో కట్టాడాలను నిర్మూలించాలన్నారు. దీనిపై వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని.. లేకపోతే.. ఉత్తర్వులను అమలు చేస్తామని నోటీసులో పేర్కొన్నారు అధికారులు.
