ఈనెల 24న ఏపీ గవర్నర్‌గా విశ్వభూషణ్ ప్రమాణ స్వీకారం

ఈనెల 24న ఏపీ గవర్నర్‌గా విశ్వభూషణ్ ప్రమాణ స్వీకారం

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ గా నియమితులైన విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈనెల 24న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  ఆ రోజు ఉదయం 11:30 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

23న భువనేశ్వర్‌ నుంచి విమానంలో బయలుదేరి తిరుపతి చేరుకుంటారు విశ్వభూషణ్. వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని..  ఆ తర్వాత విజయవాడకు వస్తారు.

విజయవాడలో మాజీ సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయాన్ని రాజ్‌భవన్‌ గా ఖరారు చేసినట్టు తెలిసింది.  ఏపీ ప్రభుత్వం దీనిపై ప్రకటన జారీ చేయాలని నిర్ణయించింది.  భవనంలోని మొదటి అంతస్థుని గవర్నర్‌ నివాసం కోసం.., కింది భాగాన్ని కార్యాలయ నిర్వహణకు ఉపయోగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.