ఎన్నికలు సమీస్తున్న వేళ ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వివిధ శాఖలకు చెందిన అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తోంది. ఇటీవల 92 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసిన ప్రభుత్వం ... ఇప్పుడు ఐఏఎస్ అధికారులను బదిలి చేసింది. మొత్తం 21 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదివారం ( జనవరి 28) ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ శాఖ కమిషనర్‌గా బాలాజీ రావ్, శ్రీకాకుళం కలెక్టర్‌గా మంజీర్ జిలానీ, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా వెంకట రమణారెడ్డి , తిరుపతి కలెక్టర్గా లక్ష్మీషా, నంద్యాల కలెక్టర్గా కె. శ్రీనివాసులను ప్రభుత్వం బదిలీ చేసింది.
బదిలీ అయిన ఐఏఎస్ అధికారులు వీరే...
-
శ్రీకాకుళం కలెక్టర్గా జిలానీ సమూన్.
-
నంద్యాల కలెక్టర్గా కె. శ్రీనివాసులు.
-
తిరుపతి కలెక్టర్గా లక్ష్మీషా.
-
అన్నమయ్య జిల్లా కలెక్టర్గా అభిషిక్త కిషోర్.
-
ప్రకాశం జేసీగా రోణంకి గోపాల కృష్ణ.
-
పార్వతిపురం-మన్యం జిల్లా జేసీగా అంబేద్కర్.
-
కాకినాడ జేసీగా ప్రవీణ్ ఆదిత్య.
-
విశాఖ జిల్లా జేసీగా మయూర్ అశోక్.
-
అల్లూరి జిల్లా జేసీగా భావ్నా.
-
నెల్లూరు జేసీగా ఆదర్శ్ రాజీందరన్.
-
విజయనగరం జిల్లా జేసీగా కార్తీక్.
-
జీవీఎంసీ అదనపు కమిషనరుగా విశ్వనాధం.
-
మున్సిపల్ శాఖ డైరెక్టర్గా బాలాజీరావు.
-
తిరుపతి మున్సిపల్ కమిషనరుగా అదితీ సింగ్.
-
శ్రీకాకుళం మున్సిపల్ కార్పోరేషన్ కమిషనరుగా తమీమ్ అన్సారీయా.
-
హౌసింగ్ కార్పోరేషన్ ఎండీగా వెంకట రమణా రెడ్డి.
-
విపత్తు నివారణ శాఖ డైరెక్టర్గా రోణంకి కూర్మనాధ్.
-
పోలవరం ప్రాజెక్టు పరిపాలన అధికారిగా ఇళక్కియా.
-
సర్వే సెటిల్మెంట్స్ అదనపు డైరక్టరుగా ఆర్ గోవింద రావు.
-
ఏపీయూఎఫ్ఐడీసీ ఎండీగా హరిత.
-
పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖ సెక్రటరీగా రేఖారాణి.