ఏపీలో ఒంటిపూట బడులు ఆ రోజు నుంచే..

ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది ముందుగానే ఎండ తీవ్రత పెరిగిన నేపథ్యంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఒంటిపూట బదులు ఎప్పుడు మొదలవుతాయా అని ఎదురు చూస్తున్నారు. అయితే, తెలంగాణాలో మార్చ్ 15నుండి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ఏపీ ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ ఏడాది ఏపీలో ఏప్రిల్ 1 నుండి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుందని వార్తలొస్తున్న నేపథ్యంలో విద్యార్ధి సంఘాల నేతలు విద్యాశాఖ అధికారులను కలిశారు.

ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో మార్చ్ 11నుండి నిర్వహించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఎండా తీవ్రతకు విద్యార్థులు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉందని, వారి క్షేమం గురించి అలోచించి ఒంటిపూట బడుల నిర్వహణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు.అయితే, మార్చ్ 18నుండి పదవ తరగతి పరీక్షలు మొదలు కానుండటంతో, వాటి నిర్వహణపై కూడా చర్చించి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. మరి, ఏపీలో బడులకు ఒంటిపూట బడులు ఎప్పటి నుండి మొదలవుతాయో వేచి చూడాలి. 

ALSO READ :- శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం... తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉందో తెలుసా...