పెన్షనర్లకు కూటమి సర్కార్ భారీ షాక్.. వారందరికీ కట్..

ఏపీలో పెన్షనర్లకు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది కూటమి సర్కార్. ప్రస్తుతం పెన్షన్లు తీసుకుంటున్నవారిలో చాలా మంది అనర్హులు ఉన్నట్లు తేల్చింది ప్రభుత్వం. ఇటీవల అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ప్రతి 10వేల మందిలో 500 మంది దాకా అనర్హులు ఉన్నట్లు తేలిందని సమాచారం. అనర్హులకు పెన్షన్ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న సీఎం చంద్రబాబు..  వచ్చే మూడు నెలల పాటూ పింఛన్‌ను పెన్షన్ పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిసైడ్ అయ్యారని.. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అనర్హులను గుర్తించి వారి పింఛన్‌ను వెంటనే కట్ చేయాలని ఆదేశించారు చంద్రబాబు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే  వారిపై కూడా కఠిన చర్యలు ఉంటాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.

అనర్హులకు పెన్షన్ అందినట్లు తేలితే.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. వారి నుంచి రెవిన్యూ రికవరీ చేపట్టడమే కాకుండా.. వారిపై కేసు కూడా నమోదు చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. దీంతో పాటు దివ్యంగుల పెన్షన్ విషయంలో కూడా అవకతవకలు గుర్తించామని.. సదరం సర్టిఫికెట్ జారీ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు చంద్రబాబు.

Also Read:-అప్పట్లో పవన్ను ఓడించిన గ్రంధి కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు.. పెద్ద కథే ఉందిగా..!

పెన్షన్ తనిఖీ కోసం చేపట్టిన పైలట్ సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 6లక్షల మంది అనర్హులను గుర్తించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మూడు నెలల్లో అనర్హులను గుర్తించే ప్రక్రియ పూర్తి చేయాలని.. పెన్షన్ తనిఖీ పూర్తయ్యాక కనీసం 5శాతం పెన్షన్లను పరిశీలిస్తానని.. అప్పటికి కూడా అనర్హులు బయటపడితే కలెక్టర్లదే బాధ్యత అని అన్నారు చంద్రబాబు. మొత్తానికి పెన్షన్ పంపిణీని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం అనర్హులకు పెన్షన్ కట్ చేస్తూనే.. అర్హతలు ఉండి కూడా పెన్షన్ అందనివారికి న్యాయం చేసే దిశగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది.