APDSC 2024: డీఎస్సీ పరీక్షపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. 

డీఎస్సీ పరీక్ష నిర్వహణపై ఏపీ ప్రబుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024 డీఎస్సీ పరీక్షను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వం విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్లో చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఎన్నికల కమిషన్ నుండి వచ్చే సమాచారం ఆధారంగా తదుపరి నిర్ణయం వెల్లడిస్తామని ప్రభుత్వం తెలిపింది.

ప్రభుత్వం మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 30నుండి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ, డీఎస్సీ పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వం ఈసీ పర్మిషన్ కోరగా అది ఆలస్యం అవటంతో పరీక్షా కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ల విడుదల వంటి పనులు నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో పాటు ఇప్పటికే నిర్వహించిన టెట్ పరీక్షకు సంబంధించిన ఫలితాలను కూడా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందుగా ఈసీ అనుమతి లభిస్తే ఫలితాలు విడుదల ఉంటుంది, లేకపోతే ఎన్నికల తర్వాతనే ఫలితాల టెట్ ఫలితాల విడుదల ఉంటుందని తెలుస్తోంది.