Tirumala Laddu Row: సుప్రీంకోర్టు ఎఫెక్ట్ తో సిట్ కు బ్రేక్..

ఏపీలో తిరుమల లడ్డూ వివాదం రేపిన రాజకీయ దుమారం పీక్స్ కి చేరింది. ఈ వివాదంపై దాఖలైన పలు పిటీషన్లపై సోమవారం ( సెప్టెంబర్ 30, 2024 ) విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డూ వివాదంపై ఏర్పాటు చేసిన సిట్ కు తాత్కాలికంగా బ్రేక్ వేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. అక్టోబర్ 3వ తేదీ వరకు  సిట్ విచారణ అవుతున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం.

సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న క్రమంలో సిట్ దర్యాప్తును అవుతున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో కేసు తీవ్రత వల్లే సిట్ వేశామని, గురువారం ( అక్టోబర్ 3,2024 ) సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం తదుపరి దర్యాప్తు ఉంటుందని తెలిపారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.

ALSO READ | ఇద్దరు వేరు వేరు సమాధానాలు చెప్తే ఎలా..? లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు

కాగా.. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు సీఎం చంద్రబాబును ఇరకాటంలో పడేశాయి. తిరుమల లడ్డూ తయారీ కోసం కల్తీ నెయ్యి వాడినట్లు ఎక్కడా ఆధారాలు లేవని...కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని పేర్కొంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ అంశంపై తదుపరి విచారణను గురువారానికి ( అక్టోబర్ 3, 2024 ) వాయిదా వేసిన ధర్మాసనం ఏ తీర్పు వెల్లడిస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.