ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం జులై 1న ఇంటింటికీ పెన్షన్ పంపిణీ దిశగా కసరత్తు చేస్తోంది. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా వృద్ధాప్య పెన్షన్ 4వేలకు పెంచుతూ, దివ్యంగుల పెన్షన్ 6వేలకు, పూర్తీ స్థాయి దివ్యంగులకు 15వేలకు, అనారోగ్యంతో బాధపడేవారికి 10వేలకు పెంచుతూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే, పెన్షన్ పంపిణీ వాలంటీర్ల ద్వారా చేయాలా లేక ప్రభుత్వ సిబ్బంది చేత చేయించాలా అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
సోమవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై క్లారిటీ రానుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పెన్షన్ పంపిణీ పై స్పందిస్తూ పెంచిన విధంగా పెన్షన్ పంపిణీ చేయటానికి ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. జులై 1న సీఎం చంద్రబాబు చేత పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కూటమి నేతలు ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ విషయంపై జూన్ 24న ( సోమవారం ) జరిగే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఓ నిర్ణయానికి రానుంది.