ఏపీ మాజీ సీఎం జగన్ గెటప్ మార్చారు.2019 ఎన్నికల తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుండి జగన్ తెల్ల చొక్కా, ఖాకీ ప్యాంటులో సింపుల్ గెటప్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం బెంగళూరులోని తన నివాసంలో ఉంటున్న జగన్ కొత్త గెటప్ లో దర్శనమిచ్చారు.ఇంతకాలం చొక్కా ప్యాంటులో కనిపించిన జగన్, ఇప్పుడు కుర్తా పైజామాలో కనిపించారు.
సతీమణి భారతితో కలిసి జగన్ కుర్తా పైజామాలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇంతకాలంలో ఒకే గెటప్ లో దర్శనమిచ్చిన తమ నేత రొటీన్ కి భిన్నమైన గెటప్ లో కనిపించటంతో వైసీపీ శ్రేణులు ఫిదా అవుతున్నారు. మరి, జగన్ ఇక మీదట ఇదే గెటప్ మెయింటైన్ చేస్తారా లేక మళ్లీ పాత గెటప్ కి షిఫ్ట్ అవుతారా అన్న చర్చ మొదలైంది సోషల్ మీడియాలో.