కేసీఆర్ బందువుల కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను బోయిన్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో మంగళవారం రాత్రి తెలంగాణ సీఎం కేసీఆర్ బందువులైన హాకీ మాజీ ప్లేయర్ ప్రవీణ్ రావుతో పాటు అతని సోదురులు ఇద్దరు కిడ్నాప్‌కు గురయ్యారు. దాంతో బాధితుల కుటుంబసభ్యులు భూమా అఖిలప్రియతో పాటు ఆమె భర్త బార్గవ రామ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు బుధవారం ఉదయం కూకట్‌పల్లిలో అఖిలప్రియను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఆమె భర్త బార్గవ రామ్ మాత్రం పరారీలో ఉన్నాడు. అఖిలప్రియను ఆమె వాహనంలోనే పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కాగా.. అరెస్టుకు ముందు మీడియాతో ఫోన్‌లో మాట్లాడిన అఖిలప్రియ తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. ‘నా భర్త కిడ్నాప్ చేయించే వ్యక్తి కాదు. నా భార్త భార్గవ్‌కు ఈ కిడ్నాప్‌తో ఎలాంటి సంబంధం లేదు. మా కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేయలేదు. నాకు కొంత సమయం ఇస్తే అన్ని విషయాలు మీడియాకు చెబుతాను. ఒకవైపు వాదనలు మాత్రమే విని మాపై తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని మీడియాను కోరుతన్నాను. మీడియా అంటే మా కుటుంబానికి చాలా గౌరవం. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తాను’ అని ఆమె అన్నారు.
For More News..
ఆంధ్రప్రదేశ్‌కు రివార్డును ప్రకటించిన కేంద్రం
గుడికొచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తను రేప్ చేసి చంపిన పూజారి
భార్యను చంపి.. మూటకట్టి పడేసిన భర్త
