శ్రీశైల దేవస్థానంలో  స్కాంపై ఏసీబీ విచారణకు దేవాదాయ శాఖ ఆదేశం

శ్రీశైల దేవస్థానంలో  స్కాంపై ఏసీబీ విచారణకు దేవాదాయ శాఖ ఆదేశం

శ్రీశైల దేవస్థానం పరిపాలన వ్యవహారాల్లో అనేక అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ స్పందించింది. క్షేత్రం నిర్వహణ, అభివృద్ధి పనులతోపాటు ఆరోపణలు మొత్తం అవకతవకల నిగ్గు తేల్చాల్సిందిగా కేసును ఏసీబీ విచారణకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2016 నుంచి ఆన్ లైన్ టికెట్ల విక్రయాలు.. విరాళాలు, వసతి, అభిషేకాల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఏసీబీకి గడువు నిర్దేశించింది.