మంత్రి సురేశ్ వెల్లడి
అమరావతి, వెలుగు: జనవరిలో 7,900 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. ఏటా జనవరిలోనే ఉద్యోగాల భర్తీ చేపట్టాలన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించామన్నారు. సోమవారం ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తామన్నారు. దీని కోసం వేసవి సెలవుల్లో టీచర్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.

