విజయవాడ: కరోనా వైరస్‌తో లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన పలు ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా పరీక్షల నిర్వహణ తేదీలు విడుదల చేసింది. ప్రవేశ పరీక్షల తేదీలకు సంబంధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం ప్రకటించారు. సెప్టెంబర్ 17 నుంచి 25 వరకూ ఇంజనీరింగ్ ఎంసెట్‌ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సెప్టెంబర్ 10,11 తేదీల్లో ఐసెట్, 14న ఈసెట్, 28,29,30 తేదీల్లో ఏపీ పీఈసెట్, అక్టోబర్ 1న ఎడ్‌సెట్, 2వ తేదీన లాసెట్ నిర్వహించనుంది.మరోవైపు.. తెలంగాణలో వచ్చే నెల 9, 10, 11, 14 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్ నిర్వహించనున్నారు.
