రేవంత్ రెడ్డి గట్స్ ఉన్న సీఎం.. అందుకే హీరోను అరెస్ట్ చేయగలిగారు : పవన్ కల్యాణ్

హైదరాబాద్ సంధ్య ధియేటర్ ఘటనపై ఫస్ట్ టైం నోరు విప్పారు హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్.. బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవటం.. అతనికి పొగరు అనుకుంటారని.. గోటితో పొయ్యే దాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారంటూ తన వైఖరి స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. 2024, డిసెంబర్ 30వ తేదీన విజయవాడలో మీడియాతో చిట్ చాట్ చేశారాయన. సంధ్య ధియేటర్ ఘటన మాట్లాడారు.

సంధ్య ధియేటర్ తొక్కిసలాటలో మహిళ చనిపోవటం బాధాకరం అని.. ఘటన జరిగిన వెంటనే హీరో అల్లు అర్జున్ లేదా నిర్మాత లేదా దర్శకుడు వాళ్ల ఇంటికెళ్లి సపోర్ట్ చేయాల్సి ఉందని.. అలా జరగకపోవటం వల్ల.. అల్లు అర్జున్ కు పొగరు అని అనుకున్నారంటూ వివరించారు పవన్ కల్యాణ్. అల్లు అర్జున్ కు కుదరకపోయి ఉంటే.. మిగతా వాళ్లు అయినా వెళ్లి ఉండాల్సింది అని తన అభిప్రాయం వెల్లడించారాయన. ఆ కుటుంబానికి మద్దతుగా నిలవాల్సి ఉందని.. అలా జరగలేదన్నారు పవన్ కల్యాణ్. అలా చెయ్యకుండా.. సమస్య మొత్తాన్ని హీరో అల్లు అర్జున్ పై నెట్టేశారని.. హీరోను ఒంటరి చేశారని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బెనిఫిట్ షోలకు అమనుతి ఇచ్చిందని.. టికెట్ రేట్లు పెంచకపోతే రికార్డ్స్ వస్తాయని ప్రశ్నించారాయన. సినిమా హాల్ కు వెళ్లి సినిమా చూడటం అనేది అందరూ హీరోలు చేయటం లేదని.. అల్లు అర్జున్ విషయంలో.. అధికారులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టటమే అన్నారు పవన్ కల్యాణ్. 

ALSO READ :అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. జనవరి 3కి తీర్పు వాయిదా

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి గట్స్ ఉన్నాయని.. అందుకే హీరోను అరెస్ట్ చేయించగలిగారంటూ రేవంత్ రెడ్డి పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. చట్టం అందరికీ సమానమే అని నిరూపించారని.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా నిలిచారని కొనియాడారు పవన్ కల్యాణ్. తెలుగు సినిమా పరిశ్రమకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని.. మీటింగ్ పెట్టి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.