తెలంగాణ సీఎం రేవంత్తో.. డిప్యూటీ సీఎం పవన్ భేటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి వచ్చిన పవన్ కల్యాణ్.. తెలంగాణ వరద సాయం కింద కోటి రూపాయల చెక్కు అందించారు. 2024, సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం వీరి భేటీ అధికారికంగా జరిగింది. 

ఇటీవల తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని విజయవాడలో భారీ వర్షాలు, వరదలు వచ్చాయి. చాలా మంది చనిపోయారు. జనం చాలా నష్టపోయారు. ఇలాంటి సమయంలో తమ వంతు బాధ్యతగా ప్రజలు, హీరోలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా.. హీరో కమ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కల్యాణ్ తన వంతు వరద సాయం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

Also Read:-తెలంగాణ అక్షరాస్యత.. ఏయే జిల్లాల్లో ఎంతెంత

సాయం ప్రకటించిన విధంగానే.. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి.. కోటి రూపాయల విరాళానికి సంబంధించిన చెక్కును స్వయంగా అందించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.