ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాల వరద బాధితుల సహాయార్థం రూ.6 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు మరియు వరదల కారణంగా సంభవించిన విధ్వంసాన్ని చూసి చలించిపోయిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి భారీ విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి విరాళం అందించనున్నారు. అలాగే పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నందున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద ముంపు బారిన పడ్డ 400 పంచాయతీలకు..ఒక్కో పంచాయతీకి రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.4 కోట్లు విరాళం ఇవ్వాలని నిర్ణయించారు.
మొత్తంగా, పవన్ కళ్యాణ్ ఇరు తెలుగు రాష్ట్రాలకు కలిపి వ్యక్తిగతంగా రూ. 6 కోట్ల భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా మరియు పంచాయతీరాజ్ మంత్రిగా రాష్ట్రంలోని ప్రతి వరద ప్రభావిత ప్రాంతం వద్ద సహాయక చర్యలను పర్యవేక్షిస్తుండంతో పాటు, ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, పవన్ ప్రకటించిన ఈ డబ్బులు కనీసం పారిశుధ్య పనులకైనా పనికొస్తే ప్రభుత్వంపై భారం తగ్గుతుందని భావిస్తున్నట్లు పవన్ వెల్లడించారు.
Good to see
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) September 4, 2024
The Man Of Words
Deputy CM @PawanKalyan garu announced 4Cr for 400 Panchayats that are affected in floods (1L/Panchayat).
1Cr for Telangana CM Relief Fund.
1Cr for AP CM Relief Fund.
A total of 6Cr donations. ??#TelanganaFloods #VijayawadaFloods pic.twitter.com/frnJSvsTjW