ఏపీలో కరోనాతో ఐదుగురు మృతి.. మరో 42 మందికి పాజిటివ్..525 కి చేరిన కేసులు

ఏపీలో కరోనాతో ఐదుగురు మృతి.. మరో 42 మందికి పాజిటివ్..525 కి చేరిన కేసులు

అమరావతి, వెలుగు: ఏపీలో బుధవారం మరో 42 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వై ద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 525కు చేరిందని పేర్కొంది. కరోనాతో మరో ఐదుగురు మృతి చెందారని వె ల్ల డించింది. మృతుల్లోగుంటూరుకు చెందిన ఇద్దరు, నెల్లూరు, కర్నూలు, విజయవాడకు చెందిన ముగ్గురు ఉన్నా రు. కొత్తగా నమోదైన కేసుల్లో కర్నూలు 19, పశ్చిమగోదావరి 8, గుంటూరు 8, కడప 3, నెల్లూరు 2, కృష్ణా , అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 14 మంది మృతి చెందగా, 20 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది.

2వేల ఆర్థిక సాయం :క్వారంటైన్ సెంటర్లలో 14రోజులు పూర్తి చేసుకొని ఇళ్లకు వెళ్లే పేదలకు రూ.2వేల సాయం అందజేస్తామని జగన్ ప్రకటించారు.