AP News: కలెక్టర్ల సదస్సులో రెండు రోజుల భోజనం ఖర్చు రూ. 1.2 కోట్లా..

ఏపీలో ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో రెండురోజుల భోజనం ఖర్చుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భోజనాలు సరఫరా చేసే కాంట్రాక్టు కోసం టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్‌కు అప్పజెప్పారు. అయితే ఈ భోజనాల ఖర్చుకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒకరోజు భోజనాల ఖర్చుకు ఏకంగా 60 లక్షలు ఖర్చు చేశారని ఆ వార్త సారాంశం. మధ్యాహ్న భోజనం, రాత్రి డిన్నర్, స్నాక్స్‌ కోసం రెండు రోజులకు గాను రూ. 1.20 కోట్లు చెల్లించారని తెలుస్తోంది.

ఈ సదస్సుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా క్యాబినెట్ మంత్రులు, 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరయ్యారు. వీరితో పాటు వివిధ శాఖల కార్యదర్శులు, అధిపతులు, కమిషనర్లు, పోలీస్ శాఖలో అనుబంధ విభాగాల అధికారులు కూడా హాజరయ్యారు.రెండు రోజులు పాటు జరిగిన ఈ సదస్సులో పాల్గొన్నవారికి భోజనాల సరఫరా కోసం కోటి 20 లక్షలు ఖర్చు చేశారన్న వార్త అందరిని షాక్ కి గురి చేస్తోంది.

Also Read :- డిసెంబర్ 30న తెలంగాణ కేబినెట్ భేటీ

ఈ క్రమంలో భోజనాల ఖర్చుపై ప్రతిపక్ష వైసీపీ విమర్శలు కురిపిస్తోంది.. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆధారాలు లేకుండా విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని.. ఈ ఖర్చు డిప్యూటీ సీఎంకు కనిపించట్లేదా అంటూ ప్రశ్నిస్తోంది వైసీపీ.
పథకాలు అమలు చేయటానికి కూడా ఖజానాలో డబ్బులు లేవని అంటున్న ప్రభుత్వం ఇప్పుడు కేవలం భోజనాల కోసం ఈ రేంజ్ లో ఖర్చు చేయటం ఏంటని కామెంట్ చేస్ర్తున్నారు నెటిజన్స్.