ఆంధ్రప్రదేశ్ సీఎం కాన్వాయ్ అంబులెన్స్‌కు దారి ఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. అదే సమయంలో గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పై వెళ్తున్న చాపర్తిన శేఖర్ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా విజయవాడ ESI ఆస్పత్రికి తరలిస్తుండగా… దీనికి ముందు ఉన్న సీఎం జగన్ కాన్వాయ్ పక్కకు జరిగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.
