జగన్ కు బర్త్ డే విషెస్ చెప్పిన సీఎం చంద్రబాబు

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు అంటారు.. కానీ, ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ లు .. ఇద్దరు ఆగర్భ శత్రువులా అన్న అనుమానం వచ్చేంత రేంజ్ లో రివెంజ్ పాలిటిక్స్ నడుపుతుంటారు. అంతటి రాజకీయ వైరం ఉన్న ఇద్దరు ఒకరికొకరు విష్ చేసుకోవడం చాలా రేర్. కానీ..  రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి జగన్ బర్త్ డే విషెస్ చెప్పారు సీఎం చంద్రబాబు. ఇవాళ (డిసెంబర్ 21, 2024 ) పుట్టిన రోజు జరుపుకుంటున్న జగన్‌కు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు.

వైఎస్ జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మంచి ఆరోగ్యంతో దీర్ఘాయువు పొందాలని కోరుకుంటున్నానంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు చంద్రబాబు. కాగా.. జగన్ పుట్టినరోజు సందర్బంగా ఇరు తెలుగు రాష్ట్రల్లో ఉన్న అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సెలెబ్రేషన్స్ చేస్తున్నారు. కేక్ కటింగ్ కార్యక్రమాలు, అన్నదానాలతో జగన్ పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. 

ఇదిలా ఉండగా.. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా జగన్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఆయురారోగ్యాలతో ధీర్ఘకాలం ప్రజాసేవలో కొనసాగాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి కూడా సోషల్ మీడియాలో జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పారు.