Unstoppable S4: అన్‌స్టాపబుల్‌ షోలో సీఎం చంద్రబాబు.. పవన్‍తో చెప్పిన మాటలు.. జైలు జీవితంపై: హైలైట్స్ ఇవే!

అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable with NBK) అంటూ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలకృష్ణ (Balakrishna). గతంలో తెలుగులో వచ్చిన టాక్ షోలకు భిన్నంగా షోను హోస్ట్ చేస్తూ బాలయ్య..అస్సల్ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఈ షోలో బాలయ్య ఎనర్జీ, టైమింగ్‌, అదిరిపోయే ప్రశ్నలతో అదరగోడుతున్నారు. గెస్ట్‌గా ఎవరు వచ్చినా వారితో సరదా మాటలతో పాటు ఆటలు ఆడిస్తూ ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తున్నారు. 

అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే నాలుగో సీజన్ తొలి ఎపిసోడ్లో ముఖ్య అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబుునాయుడు (Nara Chandrababu Naidu) విచ్చేసారు. ఈ షోలో అనేక ప్రశ్నలతో బాలకృష్ణ రాఫ్ఫాడించారు. శుక్రవారం (అక్టోబర్ 25)న జరిగిన ఈ ఎపిసోడ్ కి ‘తిరిగొచ్చిన విజయం’ పేరుతో ఆహా ఓటీటీ స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చింది.

 ‘‘ద్వాపరయుగంలో బావమరిది భవద్గీత చెబితే.. బావ విన్నాడు. ఇక్కడ బావ చెబితే.. బావమరిది వింటున్నాడు’’ అంటూ నవ్వులు పూయించడంతో ఈ షో మొదలైంది. 

Also Read : చిరంజీవి తొలి రంగస్థల నాటకానికి 50 ఏళ్లు

ఈ సందర్భంగా.. ‘చంద్రబాబునాయుడు అనే నేను బాలకృష్ణ మీద ప్రేమతో ఏది అడిగితే దానికి నవ్వుతూ సమాధానం చెబుతానని’ అంటూ ప్రమాణం చేయించగా, ‘సమయస్ఫూర్తిగా సమాధానం’ చెబుతా అని చంద్రబాబు అనడంతో నవ్వులు వెల్లివిరిశాయి. మా చెల్లితో మీరు చూసిన రొమాంటిక్ మూవీ ఒక్కటి చెప్పండని బాలయ్య అడిగితే.. నువ్వు మరీ క్రాస్ ఎగ్జామిన్ చేస్తే ఎలా అంటూ బాబు చమత్కరించారు.

“ఒక్కోసారి నాకు టైమ్ తక్కువగా ఉన్నప్పుడు నా భార్యతో కలిసి కూర్చొని నవ్వుతూ నీ సినిమాలు చూస్తే రిలాక్సియేషన్‍గా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్‌ను సపోర్ట్ చేసినట్టు కూాడా కొంత అవుతుంది. రెండు పనులు అవుతాయి” అని చంద్రబాబు చెప్పారు.

అలాగే 'ఆకాశంలో సూర్యచంద్రుల్లాగే ఆంధ్రాలో బాబు గారు, కల్యాణ్ బాబు అంటున్నారంటూ బాలయ్య తనదైన స్టైల్లో చెప్పాడు. బాలకృష్ణ ఎక్కడుంటే అక్కడ జోక్స్ ఉంటాయంటూ బాబు చమత్కారంగా అన్నారు.

దాంతో పాటుగా విశాఖ‌, విజ‌య‌వాడ న‌గ‌రాల‌ను ఫోటోల‌ను చూపించి ఏ న‌గ‌రం ఇష్టం అనే ప్ర‌శ్న‌ను బాల‌య్య అడిగారు. త‌న ఛాయిస్ అమ‌రావ‌తి అని చంద్ర‌బాబు స‌మాధానం చెప్పారు. విశాఖ‌, విజ‌య‌వాడ‌ల‌ను రెండింటిని అభివృద్ధి చేస్తామ‌న్నారు.

ఇక ఈ షోలో నారా లోకేష్ వారసుడు చంద్రబాబు మ‌నవ‌డు దేవాంశ్‌ స్క్రీన్ పై క‌నిపించి.. తాతని (చంద్ర‌బాబుని) కొన్ని ప్ర‌శ్న‌లు అడిగారు. మీరు రాజ‌కీయాల్లో బిజీగా ఉంటారు క‌దా.. తీరిక స‌మయాల్లో ఏం చేస్తుంటారు అని ప్ర‌శ్నించారు. 

‘నువ్వు టైం ఇస్తే నీతో ఆడుకుంటూ రిలాక్స్ అయ్యేవాడిని. కానీ నువ్వు టైం ఇవ్వ‌ట్లేదు క‌దా? నువ్వు ఎప్పుడూ లెక్క‌ల‌తో కుస్తీ ప‌డుతుంటావు అది బోర్ కొడితే సైన్స్ చ‌దువుతూ రిలాక్స్ అవుతావు. నాకు కూడా నేను చేస్తున్న ప‌ని మార్చుకుంటే రిలాక్స్ వ‌స్తుంది.’ అని చంద్ర‌బాబు ఫన్నీ స్టైల్ లో స‌మాధానం ఇచ్చారు.

ఇకపోతే.. తాను జైలులో గడిపిన రోజుల గురించి సీఎం చంద్రబాబు సంచలన విషయాలు బయటపెడ్డారు. ఆ సమయంలో తాను పడ్డ మనోవేదనని, బాధను, ఆవేదనని పంచుకున్నారు.

ఏ తప్పు చేయని నాకు అలాంటి అనుభవం ఎదురవుతుందని ఊహించలేదు... నిప్పులా బతికిన నాకు ఆ ఘటనను జీర్ణించుకోవడం చాలా కష్టమైంది అని వివరించారు. 

ప్రజాస్వామ్య దేశంలో.. ఎవరు తప్పు చేసినా.. అదెక్కడ చేశాడో చెప్పి, వాళ్ల సమాధానం తీసుకుని.. దాన్ని పరిశీలించాక తీవ్రమైన విషయం అనుకుంటే.. అప్పుడు అరెస్ట్‌ చేస్తారు. అది సాధారణంగా జరిగే ప్రక్రియ. 

కానీ, దర్యాప్తు అధికారి కాకుండా మరొకరు వచ్చారు... మీరెవరంటే  సూపర్ వైజింగ్ ఆఫీసర్ ని అని బదులిచ్చాడు... ఏం చేసినా చెల్లుతుందని అహంకారపూరితంగా వ్యవహరించారు... అంటూ చంద్రబాబు వెల్లడించారు.

ఎలాంటి పరిస్థితిలోనూ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని పనులన్నీ చేశా. రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నా. ఇన్ని చేసిన నాకు ఆ రోజు అలా జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. అదీ.. రాష్ట్రంలో ఆనాటి పరిస్థితి. నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. నిప్పులా బతికా. తప్పకుండా నేను చేసే ప్రతి పనినీ ప్రజలు తప్పు పట్టకుండా సపోర్ట్‌ చేస్తారనే విశ్వాసం నాకెప్పుడూ ఉంది. అదే గెలిపించింది.

అలాగే జైల్లో తొలిరోజు ఎలా గడిచింది? అనే ప్రశ్న ఎదురవ్వగా..తన జైలు జీవితంపై మాట్లాడుతూ.. "నంద్యాలలో నన్ను అరెస్ట్ చేయడం నుంచి రాజమండ్రి జైలుకు తీసుకెళ్లే వరకు మధ్యలో ఎన్నో సంఘటనలు చోటుచేసుకున్నాయి. దర్యాప్తు అంటూ రాత్రంతా తిప్పారు. వేకువజామున వైద్య పరీక్షలకు పంపించారు... విపరీతంగా తిప్పి కోర్టుకు తీసుకెళ్లారు... కోర్టులో సాయంత్రం వరకు వాదనలు జరిగాయి.. చివరికి అర్ధరాత్రి వేళకు జైలుకు తరలించారు.

ఇవన్నీ తలచుకుంటే హృదయం తరుక్కుపోతుంది. నా జైలు జీవితం గురించి ఎవరైనా ఓ పుస్తకం రాయొచ్చు. చనిపోతే ఒక్క క్షణం. అనుకున్న ఆశయం కోసం పనిచేస్తే అది శాశ్వతం. అదే నన్ను ముందుకు నడిపించింది. చావు గురించి ఆలోచిస్తే జీవితంలో ఏది చేయలేము అని అన్నారు. 

ఇక తెలుగు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన మీటింగ్ అది, అక్కడ ఏం జరిగిందనేది ప్రజలు తెలియాలని బాలకృష్ణ అడిగారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చారు. ఆయనతో నేను మాట్లాడింది రెండే నిమిషాలు.. పొత్తుపై నేనే ప్రతిపాదన చేశాను... అయితే ఆలోచించి నిర్ణయం తీసుకోమని పవన్ ను కోరాను...(అందరం కలికి పోటీ చేద్దామని తాను చూచాయిగా ఆ భేటీలో చెప్పానని తెలిపారు).

ఆ తర్వాత పొత్తును పవన్ ప్రకటించారని అన్నారు. కానీ ఆయన జైలు నుంచి బయటికొచ్చిన వెంటనే పొత్తు ఉంటుందని ప్రకటించారని.. అందుకు బీజేపీని కూడా ఒప్పిస్తామని చెప్పడంతోనే కూటమి విజయానికి పునాది పడిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం NBK అన్‌స్టాపబుల్‌ షోలో సీఎం చంద్రబాబు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Beta
Beta feature
  • Beta
Beta feature