ఏపీ కేబినెట్లోకి నాగబాబు

హైదరాబాద్, వెలుగు: ఏపీ రాజ్యసభ అభ్యర్థులుగా మాజీ ఎంపీ బీద మస్తాన్ , సానా సతీశ్ ల పేర్లను టీడీపీ ఖరారు చేసింది. అలాగే..ఏపీ కేబినెట్ లోకి జనసేన నేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబును తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. బీద మస్తాన్ , మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్య గతంలో వైసీపీ తరఫున రాజ్యసభ ఎంపీలుగా ఉండి ఇటీవల రాజీనామా  చేశారు. దాంతో మూడు సీట్లు ఖాళీ అయ్యాయి. వాటికి ఈ నెల 20న ఎన్నిక జరగనుంది. 

ఇప్పటికే తమ అభ్యర్థిగా ఆర్ .కృష్ణయ్య పేరును బీజేపీ ప్రకటించింది.ఆర్. కృష్ణయ్య సీటును నాగబాబుకు ఇవ్వాలని గతంలో భావించగా.. బీజేపీ కృష్ణయ్య పేరును ఖరారు చేయటంతో నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటున్నారు. ఏపీ కేబినెట్ లో 25 మంత్రులకు అవకాశం ఉండగా ప్రస్తుతం 24 మందే ఉన్నారు. నాగబాబు చేరితే 25కు చేరుతుంది.