2029లోనే జమిలీ ముందస్తు ఉండవ్: ఏపీ సీఎం చంద్రబాబు

హైదరాబాద్, వెలుగు: ఒకవేళ జమిలి ఎన్నికలు వచ్చినా.. జరిగేది మాత్రం 2029లోనే అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలు ఉండవని, షెడ్యూల్ ప్రకారం ఐదేండ్ల తర్వాతే ఏపీలో ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో చంద్రబాబు నాయుడు చిట్​చాట్ చేశారు.

జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలపగా, త్వరలో పార్లమెంట్​లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలో ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ చీఫ్ చంద్రబాబు.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పడం గమనార్హం.