ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 31వ తేదీన రాష్ణ్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్‌లోని కేబినెట్ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులకు, అధికారులకు సమాచారం అందించినట్టు పేర్కొన్నారు. సచివాలయంలోని అన్ని శాఖల ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు తమ ప్రతిపాదనలను క్యాబినెట్ హ్యాండ్ బుక్ లో వివరించిన విధంగా నిర్ణీత ఫార్మాట్ లో పంపాలనీ, సాధారణ పరిపాలనకు సూచించిన సూచనల్లో జారీ చేసిన సూచనలతో సహా ఎప్పటికప్పుడు ఆదేశాలను పాటించాలని కోరారు.
ఈ కేబినెట్ సమావేశంలో రాజధాని మార్పు, విశాఖ నుంచి పాలన కొనసాగించడం సహా పలు కీలక అంశాలపై చర్చ జరగనుందని సమాచారం అందుతోంది. పలు సంక్షేమ పథకాలపై కూడా కీలక నిర్ణయాలు తీసుకకునే అవకాశముందని సంబంధిత వర్గాలు తెలిపాయి.