♦ కొత్త బిల్లుకు ఏపీ దిశ యాక్ట్ అని నామకరణం
♦ ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్
అత్యాచారానికి పాల్పడిన దోషులకు ఉరి వేసేలా ఏపీ ప్రభుత్వం కొత్తచట్టాన్ని అమలు చేసింది. ఈ కొత్త చట్టానికి ఏపీ దిశ యాక్ట్ అని నామకరణం చేసింది. ఈ బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
అత్యాచార దోషులకు 21రోజుల్లో ఉరిశిక్ష
అత్యాచారానికి పాల్పడితే మరణిశిక్ష విధించేలా ఏపీ ప్రభుత్వం కొత్తచట్టాన్ని అమలు చేసింది. నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లో తీర్పు ఇవ్వనుంది. వారం పనిదినాల్లో దర్యాప్తు పూర్తి, 14 రోజుల్లో విచారణ పూర్తి, మొత్తం 21 రోజుల్లో జడ్జిమెంట్ ఇచ్చేలా బిల్లులో మార్పులు చేశారు. ప్రస్తుతం ఉన్న 4 నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు తదితర నేరాలకు విచారణకు ప్రతీజిల్లాలో ప్రత్యేక కోర్టులకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
మహిళల్ని కించపరుస్తూ పోస్ట్ లు పెడితే జైలుకే
సోషల్ మీడియాలో మహిళలను కించపరిచేలా, వారి గౌరవానికి భంగం కలిగించేలా పోస్టింగులు పెడితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. సెక్షన్ 354 (ఇ) కింద మొదటి సారి తప్పు చేస్తే 2 సంవత్సరాలు, రెండోసారి తప్పుచేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష విధించేలా తీర్పు ఇవ్వనుంది. పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే 354 (ఎఫ్) కింద ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధించేలా ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకోగా..పోస్కోచట్టం కింద ఇప్పటివరకూ 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకూ జైలుశిక్ష అమలు చేయనున్నారు.
