పోలీసులు-బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం
విజయనగరం: ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థంలో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీ శ్రేణులు ఛలో రామతీర్థం పిలుపునివ్వడంతో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున బయలుదేరాయి. విజయనగరం డివిజన్లో ఈనెలాఖరు వరకు 30 యాక్ట్‌ను విధించడంతో భారీగా పోలీసు బలగాలను మొహరించారు. కొండపైనే కాదు.. కొండకు వెళ్లే మార్గంలో అన్ని చోట్లా పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఛలో రామతీర్థం పిలుపులో భాగంగా బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతోపాటు.. ఇతర ముఖ్య నేతలు తరలివస్తుండగా నెల్లిమర్లలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు.. పోలీసుల మధ్య వాగ్వాదాలు.. తోపులాటలు జరిగాయి. బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు అస్వస్థతకు గురై సొమ్మసిల్లిపడిపోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ.. ఆలయ సందర్శనకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. పోలీసులు వీధి రౌడీల్లా ప్రవర్తించారని విమర్శించారు. వైసీపీ జెండాలు కప్పుకోండి.. బీజేపీ కార్యకర్తలను రామతీర్థంలో అనుమతిచ్చే వరకు సీఎం జగన్, పోలీసులను విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ బీజేపీ, జనసేన శ్రేణులు అక్కడే బైఠాయించి నిరసన తెలియజేశారు. అంతకుముందు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు మాట్లాడుతూ వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డికి అనుమతిచ్చి తమను అడ్డుకోవడం సరికాదని వాగ్వాదం చేశారు.
ప్రభుత్వ ఆఫీసుల తీరు మారాలి
క్రికెటర్ల జీవితాలతో ఆటలు.. హెచ్ సి ఎ చెత్త పాలనతో ప్లేయర్లకు ఇక్కట్లు
సోషల్ మీడియాలో ఆడవాళ్లపై పెరిగిన వేధింపులు
రూ.50 లక్షల లోపు ఇండ్లకు ఫుల్ డిమాండ్
