AP Assembly: జూన్ 21, 22 తేదీల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం చకచకా నిర్ణయాలు అమలు చేస్తూ పాలనాపరమైన వ్యహారాలకు సన్నద్ధం అవుతోంది. నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు ఇప్పటికే పలు శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్షలు నిర్వహించి పోలవరం, అమరావతిలపై ప్రత్యేక దృష్టి పెట్టగా మంత్రులు ఒక్కొక్కరు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

జూన్ 21, 22న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సమావేశాలకు ప్రొటెం స్పీకర్ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరిస్తారని, స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడును ఎన్నుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.