AP అసెంబ్లీ రద్దు : గెజిట్ నోటిఫికేషన్ విడుదల

AP అసెంబ్లీ రద్దు : గెజిట్ నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ శాసనసభను రద్దు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ కార్యాలయం ఈ గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను ఈసీ… రాజ్ భవన్ కు అందించింది. దీంతో.. అసెంబ్లీని రద్దుచేస్తూ… గెజిట్ ను విడుదలచేశారు అధికారులు. ఇవాళ వైసీపీ శాసనసభాపక్షం చేసిన తీర్మానంతో పార్టీ అధినేత జగన్ .. గవర్నర్ ను హైదరాబాద్ లో కలుస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామంటూ గవర్నర్ ను కోరతారు. సీఎంగా ప్రమాణ స్వీకారం, శాసన సభ సమావేశాల తేదీలను గవర్నర్ కు వివరిస్తారు.