నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు : ఏవో సునీత

ఉప్పునుంతల, వెలుగు : రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏవో సునీత, ఎస్ఐ లెనిన్  తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని ఫర్టిలైజర్, సీడ్స్​ షాపులను తనిఖీ చేశారు. రికార్డులు, విత్తనాలను పరిశీలించారు.

రైతులకు విత్తనాలు, ఎరువులకు సంబంధించిన రసీదులు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. ఇదిలాఉంటే మండలంలోని వెల్టూర్  గ్రామంలో ఏఈవో భరత్  రైతులతో సమావేశమై నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.