ఈవీ చార్జింగ్ పాయింట్లను ఎవరైనా పెట్టొచ్చు

  • 200 నుంచి 300 చదరపు అడుగుల స్థలం ఉంటే చాలు 
  • గ్రేటర్​ సిటీలో ఈవీ చార్జింగ్​పాయింట్లు పెంచేందుకు ‘రెడ్​కో’ ప్లాన్

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​పరిధిలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో చార్జింగ్​పాయింట్లను కూడా పెంచాలని తెలంగాణ రెడ్​కో(రెన్యువబుల్​ఎనర్జీ డెవలప్​మెంట్​కార్పొరేషన్) అధికారులు ప్లాన్​చేస్తున్నారు.  ప్రస్తుతం గ్రేటర్​లో రెండు లక్షల వరకు ఎలక్ట్రిక్​వెహికల్స్​ఉన్నాయి. అయితే చార్జింగ్​పాయింట్లు 131 మాత్రమే ఉన్నాయి. పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా మరో 19 చార్జింగ్​పాయింట్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు రెడ్కో ప్రాజెక్ట్​డైరెక్టర్ రామకృష్ణ తెలిపారు.

డిమాండ్​ఉన్న ప్రాంతాల్లో కొత్తగా  చార్జింగ్​పాయింట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతానికి సిటీలోని చార్జింగ్​పాయింట్లను తామే నిర్వహిస్తున్నామని, ప్రైవేట్​వ్యక్తులు ముందుకు వస్తే చార్జింగ్​పాయింట్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తామన్నారు. చార్జింగ్​పాయింట్​ఏర్పాటుకు కనీసం 200 నుంచి 300 చదరపు అడుగుల స్థలం ఉంటే సరిపోతుందన్నారు.

ఇప్పటికే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని, సాఫ్ట్​వేర్​కంపెనీలు, మాల్స్, హోటల్స్​ఉన్న ప్రాంతాల్లో పాయింట్ల ఏర్పాటుకు అనువుగా ఉంటుందన్నారు. నిరుద్యోగ యువత, ప్రైవేట్​వ్యక్తులు దరఖాస్తు చేసుకుంటే నిబంధనలను పరిశీలించి అనుమతులు జారీ చేస్తామని రామకృష్ణ తెలిపారు.