Virat Kohli,Anushka: గల్లీ క్రికెట్‌ ఆడుతూ విరుష్క జోడీ సందడి.. కొత్త రూల్స్‌తో కోహ్లీని ఔట్ చేసిన అనుష్క

దేశంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు ప్రత్యేక క్రేజ్ ఉంది. ఒకరేమో క్రికెట్ లో టాప్ ప్లేయర్ అయితే మరొకరేమో సినిమాల్లో స్టార్ హీరోయిన్. వీరిద్దరూ వివాహం చేసుకొని ఒకటి కావడంతో ఆ క్రేజ్ ఆకాశాన్ని దాటేసింది. ఇద్దరూ కలిసి ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. విరుష్క జోడీ తాజాగా గల్లీ క్రికెట్ ఆడుతూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్నఈ వీడియోలో ముందుగా విరాట్ కోహ్లీ అనుష్క శర్మ కలిసి పుమా యాడ్ లో నటించారు.

అనుష్క శర్మ.. నేను నిన్ను నా రూల్స్ తో క్రికెట్ మ్యాచ్‌లో ఓడించగలను. అని చెబుతుంది. ఇందులో భాగంగా అనుష్క పెట్టిన రూల్స్ కోహ్లీకి ఆశ్చర్యం కలిగించాయి. మొదట అనుష్క బ్యాటింగ్ చేసింది. తొలి బంతికే విరాట్ ఔట్ చేశాడు. దీంతో ఆమె తొలి బంతి ట్రయల్ బాల్ అంటూ కోహ్లీకి మళ్ళీ బౌలింగ్ చేయమంటుంది. ఓకే అని విరాట్ బౌలింగ్ వేసి ఆ తర్వాత బంతికి ఔట్ చేస్తాడు. ఇక చేసేదేమీ లేక కోహ్లీకి బ్యాటింగ్ అప్పగిస్తుంది. అనుష్క వేసిన తొలి బంతికే విరాట్ భారీ షాట్ కొడతాడు. 

Also Read :- న్యూజిలాండ్‌తో భారత్ తొలి పోరు

గల్లీ క్రికెట్ లో బాల్ ఎవరు కొడితే వారే తెచ్చుకోవాలి అనే రూల్ చెబుతుంది. దీంతో కోహ్లీ కష్టపడి బాల్ తెస్తాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేయడానికి కోహ్లీ ఇంకా క్రీజ్ దగ్గరకు రాకుండానే బాల్ వేసి బౌల్డ్ చేస్తుంది. షాక్ కు గురైన విరాట్ ఇదేంటి అంటాడు. అనుష్క మాత్రం ఔట్ అని వాదిస్తుంది. ఆ తర్వాత కోహ్లీ కోపంతో వెళ్లిపోతుంటే.. నీకు కోపం వస్తే నువ్వు ఔటైనట్టే అనే రూల్ చెబుతుంది. ఈ సీన్ మొత్తం ఎంతో ఫన్నీగా సాగింది. ప్రస్తుతం కోహ్లీ న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ కు సిద్ధమవుతున్నాడు.