తమ్ముడు చనిపోయిన దు:ఖంలోనూ పరీక్ష రాసిన అక్క

మరికల్, వెలుగు : అనారోగ్యంతో తమ్ముడు చనిపోయినా, పుట్టెడు దు:ఖంలోనూ అక్క టెన్త్​ పరీక్ష రాసింది. మరికల్​కు చెందిన కుర్వ రామాంజనేయులు కొడుకు అర్జున్​(5) అనారోగ్యంగా బాధపడుతుండడంతో హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​హాస్పిటల్​లో చేర్పించారు. అక్కడి నుంచి ఉస్మానియా హాస్పిటల్​కు తరలించారు. 15 రోజులుగా అక్కడ ట్రీట్​మెంట్​పొందుతున్నాడు.  

కాగా అర్జున్​ బుధవారం రాత్రి మృతి చెందాడు. బాలుడి డెడ్​బాడీని ఇంటికి తీసుకొచ్చారు. స్థానిక ప్రతిభ హైస్కూల్​లో టెన్త్​చదువుతున్న అనూషకు గురువారం సైన్స్​పరీక్ష ఉంది. తమ్ముడు చనిపోయిన ఆవేదనను దిగమింగుకొని, టీచర్ల సూచనలతో పరీక్షకు అటెండయ్యింది. తర్వాత తమ్ముడి అంత్యక్రియల్లో పాల్గొంది.