Anupama Parameswaran: పరదాలో అనుపమ.. వరుస సినిమాలు చేస్తోన్న మలయాళ కుట్టి

పదేళ్ల క్రితం సినిమా ఇండస్ట్రీలో 'ప్రేమమ్' తో అడుగు పెట్టిన మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran). ఈ పదేళ్ల కాలంలో మలయాళం, తెలుగు, కన్నడం, తమిళ భాషల్లో నటించి క్రేజీ అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఏడు సినిమాలున్నాయి. 

అందులో రెండు తెలుగు సినిమా కాగా మలయాళ, తమిళ్ సినిమాలు ఎక్కువ ఉన్నాయి. టిల్లు స్క్వేర్ సినిమాలో లిప్ లాక్ లతో నానా హైరానా చేసిన ఈ భామ.. ఇపుడు అందాల ఆరబోతకు రెడీ అంటుండటంతో అవకాశాలు తోసుకుంటూ వచ్చేస్తున్నాయి. తనకు ఇంటర్వ్యూలు ఇవ్వడం అన్నా.. అందాలు ఆరబోస్తూ.. ఫోటోషూట్స్ కు అటెండ్ కావడం అన్నా.. ఇష్టం ఉండదని చెబుతుంది ఈ చిన్నది. 

ALSO READ | Sunny Leone: పింఛన్ స్కామ్ పై స్పందించిన సన్నీ లియోన్.. పోలీసుల విచారణకి సహకరిస్తా..

అయితే, ఈ కేరళ కుట్టి ఇన్ స్టాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. ఈ అమ్మడికి 16 మిలియన్ల ఫాలోవర్లున్నారు. రెగ్యులర్ అందాల ఫోటోలను షేర్ చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ ఫోటోల్లో ఎక్కువ శాతం ఇష్టం లేకుండానే తీయించుకున్న ఫోటోలుగా చెప్పు కొచ్చింది.

హీరోయిన్ గా మరో పది సంవత్సరాలు కొనసాగాలి అంటే ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటో షూట్స్ ను ఇష్టం లేకున్నా, చిరాకు అయినా కంటిన్యూ చేయాల్సిందే కదా అంటుంది. 

బడా హీరోయిన్లంతా వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ మధ్యే త్రిష, నయనతార, అనుష్క వంటి హీరోయిన్స్  నటించిన సినిమాలు హిట్ అవ్వడంతో.. సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశారు.

అంతేకాకుండా.. ఫామ్ కోల్పోయిన యంగ్ హీరోయిన్స్ కూడా ఎక్కడా ఖాళీ లేమంటూ..తమదైన మూవీస్ తో ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఒకవేళ సినిమా అవకాశాలు ఎక్కువ లేకున్న..ఇన్స్టా వంటి సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేస్తూ బిజీగా ఉన్నారు. 

'సినిమా బండి' దర్శకుడు ప్రవీణ్‌ కాండ్రేగుల (Praveen Kandregula) డైరెక్షన్లో ఒక సినిమాకు అనుపమ పరమేశ్వరన్‌ కమిట్ అయ్యింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. 'పరదా' అనే విభిన్నమైన టైటిల్‌ ను ఖరారు చేసినట్లు సమాచారం.

ఆనంద మీడియా బ్యానర్ పై విజయ్ డొంకాడ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ తో పాటు సంగీత, దర్శన రాజేంద్రన్‌, రాగ్ మయూర్‌ ఇంకా పలువురు యంగ్‌ స్టార్స్ కీలకపాత్రలు పోషించారు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రాబోతున్న 'పరదా'(Parada) సినిమాలో అనుపమను ఎలా కనిపిస్తుందో అంటూ ఫ్యాన్స్ ఊహించేసుకుంటున్నారు. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నఈ చిత్రం నుండి త్వరలో క్రేజీ అప్డేట్ రానుంది.